అప్పుడు వాళ్ళు ఇప్పుడు మేము అంటున్న కార్తిక

అప్పుడు వాళ్ళు ఇప్పుడు మేము అంటున్న కార్తిక

Published on Oct 25, 2012 12:00 PM IST


జోష్ చిత్రంతో తెరకు పరిచయమయిన కథానాయిక కార్తిక. సిని నటి రాధా కూతురయిన కార్తిక “రంగం” చిత్రంతో మంచి పేరు సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ భామ భారతీరాజా దర్శకత్వంలో ‘అన్న కొడియుం కొడి వీరనుం’ చిత్రంలోను, డీల్ చిత్రంలోను నటిస్తోంది. ఈ రెండు చిత్రాలు తేని జిల్లలో చిత్రీకరణ జరుపుకుంటూ ఉండటంతో తేని జిల్లాకి తనకి అవినాభావ సంబంధం ఉంది అని కార్తిక అంటుంది. మీకు మీ చెల్లెలు పోటీ కానుందా అని అడిగిన ప్రశ్నకు కార్తిక తెలివిగా సమాధానం ఇచ్చింది. ఆ కాలంలో తన తల్లి రాధా ఆమె సోదరి అంబిక ఒకేసారి చిత్రాల్లో రాణించారని ఇప్పుడు కూడా మేము ఇద్దరం విజయం సాదిస్తామని నమ్మకం ఉందని అన్నారు. రాధా రెండవ కూతురు, కార్తిక చెల్లెలు అయిన తులసి ప్రస్తుతం మణిరత్నం “కడల్” లో నటిస్తుంది ఈ చిత్రం తరువాత “యాన్” అనే చిత్రంలో కనిపించనుంది. ఈ అక్క చెల్లెలు తెర మీద విజయం సాదించాలని ఆశిద్దాం.

తాజా వార్తలు