కరీనా కపూర్ ని డైరెక్ట్ చేయనున్న క్రిష్

కరీనా కపూర్ ని డైరెక్ట్ చేయనున్న క్రిష్

Published on Oct 20, 2013 8:00 PM IST

Krish-and-Kareena
‘గమ్యం’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన క్రిష్ ఆ తర్వాత తీసిన ‘వేదం’, ‘కృష్ణం వందే జగద్గురుమ్’ సినిమాలతో విమర్శకులు మెచ్చిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం క్రిష్ హిందీలో చేయనున్న మొదటి సినిమా ‘గబ్బర్’ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. అక్షయ్ కుమార్ హీరోగా నటించనున్న ఈ సినిమా తమిళ్ సూపర్ హిట్ ఫిలిం ‘రమణ’కి రీమేక్. ఇదే సినిమా తెలుగులో ‘ఠాగూర్’ గా వచ్చింది.

ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ లో ఒకరుగా కరీనా కపూర్ ని ఎంపిక చేసారు. తెలుగులో జ్యోతిక చేసిన పాత్రని హిందీలో కరీనా కపూర్ చేయనుంది. కావున త్వరలోనే క్రిష్ కరీనా కపూర్ ని డైరెక్ట్ చేయనున్నాడు. సంజల్ లీలా భన్సాలి నిర్మించనున్న ఈ సినిమా జనవరిలో సెట్స్ పైకి వెళ్లనుంది.

తాజా వార్తలు