నైజాంలో డే 1 గట్టి ఓపెనింగ్స్ తో అదరగొట్టిన ‘కాంతార 1’

నైజాంలో డే 1 గట్టి ఓపెనింగ్స్ తో అదరగొట్టిన ‘కాంతార 1’

Published on Oct 3, 2025 4:00 PM IST

Kantara-Chapter-1

కన్నడ టాలెంటెడ్ నటుడు అలాగే దర్శకుడు రిషబ్ శెట్టి నటించి తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే “కాంతార 1”. రుక్మిణి వసంత్ నటించిన ఈ చిత్రం నిన్న గ్రాండ్ గా రిలీజ్ అయ్యి సాలిడ్ ఓపెనింగ్స్ ని దక్కించుకుంది. అయితే కన్నడలో ఈ సినిమాకి ఏ రేంజ్ లో హైప్ ఉందో తెలుగులో కూడా అదే రీతిలో ఓపెనింగ్స్ ని కొల్లగొట్టే రేంజ్ హైప్ తో ఈ చిత్రం వచ్చింది. ఇక అనుకున్నట్టే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ సాధించినట్టు తెలుస్తుంది.

దీనితో పి ఆర్ లెక్కల ప్రకారం మొదటి రోజు నైజాం వసూళ్లు తెలుస్తున్నాయి. ఇలా కాంతార 1 ఇక్కడ 3.8 కోట్ల షేర్ ని అది కూడా ఎలాంటి జీ ఎస్ టి లేకుండా అందుకోవడం విశేషం. అంటే గ్రాస్ సుమారు 8 కోట్ల దగ్గరే వచ్చి ఉంటుంది అని చెప్పవచ్చు. ఇక డే 2 కూడా ఇదే రేంజ్ బుకింగ్స్ కాంతార 1 కి కనిపిస్తుండగా ఈ వీకెండ్ లో మరింత ఎక్కువ వసూళ్లు ఈ చిత్రానికి వచ్చే ఛాన్స్ ఉంది. ఇక ఈ సినిమాకి అజనీష్ లోకనాథ్ సంగీతం అందించగా హోంబళే ఫిల్మ్స్ వారు నిర్మాణం వహించారు.

తాజా వార్తలు