వరల్డ్ వైడ్ ‘కాంతార 1’ డే 1 వసూళ్ల ప్రిడిక్షన్!

వరల్డ్ వైడ్ ‘కాంతార 1’ డే 1 వసూళ్ల ప్రిడిక్షన్!

Published on Oct 2, 2025 4:01 PM IST

కన్నడ స్టార్ నటుడు రిషబ్ శెట్టి హీరోగా తన స్వీయ దర్శకత్వంలోనే రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించిన “కాంతార 1” గ్రాండ్ గా నేడు రిలీజ్ అయ్యిన సంగతి తెలిసిందే. మంచి హైప్ నడుమ పాన్ ఇండియా భాషల్లో డే 1 కి సాలిడ్ బుకింగ్స్ ని కనబరిచిన ఈ చిత్రం దుమ్ము లేపింది. దీనితో ముందు కొంచెం ప్రీ సేల్స్ అటు ఇటు గానే కనిపించినప్పటికీ రిలీజ్ రోజు మాత్రం కాంతార 1 ర్యాంపేజ్ చూపిస్తుంది.

ఇలా మొదటి రోజు ఇండియా వైడ్ భారీ బుకింగ్స్ ని చూస్తున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ కూడా డే 1 కి మూమెంటం మార్చుకుంది. దీనితో కాంతార 1 వరల్డ్ వైడ్ గా సాలిడ్ ఓపెనింగ్స్ అందుకునే ఛాన్స్ ఉన్నట్టుగా ట్రేడ్ వర్గాల్లో అంచనాలు వినిపిస్తున్నాయి. దీనితో కాంతార 1 ప్రపంచ వ్యాప్తంగా 80 నుంచి 90 కోట్ల మేర గ్రాస్ ని అందుకునే ఛాన్స్ ఉన్నట్టుగా ఇప్పుడు వినిపిస్తుంది.

ముందు రోజుకే 30 కోట్ల ప్రీసేల్స్ దాటాయి. కానీ డే 1 కి మాత్రం మొత్తం లెక్కలు మారిపోయాయి. సో మొదటి రోజు మాత్రం కాంతార 1 ఒక ఊహించని ఓపెనింగ్స్ ని అందుకునే ఛాన్స్ ఉన్నట్టుగా ఇపుడు టాక్. ఇక ఈ చిత్రానికి అజనీష్ లోకనాథ్ సంగీతం అందించగా హోంబళే ఫిల్మ్స్ నిర్మాణం వహించారు.

తాజా వార్తలు