హిందీలో సాలిడ్ మార్క్ కొట్టేసిన కాంతార వసూళ్లు!

Kantara-Chapter-1

కన్నడ సినిమా నుంచి వచ్చి బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతున్న లేటెస్ట్ చిత్రమే కాంతార చాప్టర్ 1. మంచి హైప్ లో వచ్చి వాటిని రీచ్ అయ్యి భారీ వసూళ్లు సొంతం చేసుకున్న ఈ సినిమా హిందీలో కూడా డీసెంట్ రన్ ని అలా కొనసాగిస్తుంది. మరి నార్త్ మార్కెట్ లో రెండో వారం వీక్ డేస్ లోకి వచ్చిన ఈ సినిమా వసూళ్ల డ్రాప్ అయితే చూసింది.

దీనితో నిన్న సోమవారం 4.45 కోట్ల నెట్ వసూళ్లు అందుకోగా ఈ వసూళ్లతో మొత్తం 150 కోట్ల సాలిడ్ మార్క్ ని ఈ చిత్రం దాటేసినట్టుగా ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యింది. మరి లాంగ్ రన్ లో కేవలం హిందీ నుంచే 200 కోట్ల వరకు రావచ్చని చెప్పవచ్చు. మరి కాంతార 1 ఎక్కడ వరకు వెళ్లి ఆగుతుందో చూడాలి. ఇక ఈ చిత్రం రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించగా అజనీష్ లోకనాథ్ సంగీతం అందించాడు. అలాగే హోంబళే ఫిల్మ్స్ వారు నిర్మాణం వహించారు.

Exit mobile version