ప్రభాస్ విషయంలో “కన్నప్ప” మేకర్స్ మరింత కేర్ తీసుకోవాలి!

ప్రభాస్ విషయంలో “కన్నప్ప” మేకర్స్ మరింత కేర్ తీసుకోవాలి!

Published on Feb 4, 2025 10:12 AM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ఇపుడు పలు సినిమాలు హీరోగానే కాకుండా తన స్టార్డం అంత ఉన్నపటికీ గెస్ట్ రోల్ లో “కన్నప్ప” అనే భారీ సినిమా కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. మంచు విష్ణు హీరోగా తన కెరీర్ భారీ ప్రాజెక్ట్ అది కూడా తన డ్రీం ప్రాజెక్ట్ గా దీనిని చేస్తున్నారు. మరి ఈ చిత్రం కోసం పాన్ ఇండియా వైడ్ గా నలు మూలలు నుంచి బిగ్ స్టార్స్ ని మేకర్స్ పట్టుకోగా ప్రభాస్ కూడా రుద్రా అనే రోల్ ని చేస్తున్నట్టుగా నిన్న పోస్టర్ రిలీజ్ చేశారు.

మరి ఈ పోస్టర్ చూసాక ఒకింత ఫ్యాన్స్ డిజప్పాయింట్ అయ్యారని చెప్పక తప్పదు. దీనికంటే ఆ మధ్య వచ్చిన షూట్ మధ్యలో ఫొటోస్ లోనే ప్రభాస్ ఎంతో బాగున్నాడని అవి కూడా వైరల్ అవుతున్నాయి. మరి ప్రభాస్ లాంటి స్టార్ ని పెట్టుకొని మేకర్స్ ఈ తరహా డిజప్పాయింటింగ్ అప్డేట్స్ ఇస్తే అది సినిమాకే ఎఫెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. మరి నెక్స్ట్ నుంచి వచ్చే అప్డేట్స్ లో అయినా మేకర్స్ వీటిలో కేర్ తీసుకుంటారో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు