‘థగ్ లైఫ్’.. మేము సేఫ్ అంటున్న కన్నడ ప్రేక్షకులు!

‘థగ్ లైఫ్’.. మేము సేఫ్ అంటున్న కన్నడ ప్రేక్షకులు!

Published on Jun 7, 2025 3:00 AM IST

యూనివర్సల్ హీరో కమల్ హాసన్, క్లాసిక్ డైరెక్టర్ మణిరత్నం కాంబినేషన్‌లో చాలా ఏళ్ల తర్వాత తెరకెక్కిన చిత్రం ‘థగ్ లైఫ్’. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు ఈ సినిమాలో శింబు, త్రిష వంటి స్టార్స్ నటిస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూశారు. అయితే, జూన్ 5న రిలీజ్ అయిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి నెగిటివ్ రెస్పాన్స్ దక్కింది.

ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుకోవడంలో పూర్తిగా ఫెయిల్ అయింది. దీంతో ఈ సినిమాకు ఫ్లాట్ టాక్ వచ్చింది. అయితే, ఈ సినిమాకు ఇలాంటి రిజల్ట్ రావడంతో కన్నడ ప్రేక్షకులు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో కమల్ చేసిన కొన్ని కామెంట్స్ కన్నడ ప్రజలను తీవ్ర ఆగ్రహానికి గురి చేశాయి. ఆయన క్షమాపణలు చెబితేనే కర్ణాటకలో థగ్ లైఫ్ రిలీజ్ చేయాలని ఆ రాష్ట్రంలోని డిస్ట్రిబ్యూటర్స్ కండీషన్ పెట్టారు.

దీంతో కమల్ తన సినిమాను కర్ణాటకలో రిలీజ్ చేయలేదు. ఇప్పుడు వారు ఈ సినిమా తమ రాష్ట్రంలో రిలీజ్ కాకపోవడమే మంచిదయ్యిందని.. లేదంటే ఇతర భాషల ప్రేక్షకుల మాదిరిగా తాము కూడా ఓ ఫ్లాప్ చిత్రానికి బలయ్యేవారిమని వారు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు