తెలుగులో రిమేక్ అవ్వనున్న కంగనా క్వీన్?

తెలుగులో రిమేక్ అవ్వనున్న కంగనా క్వీన్?

Published on Mar 16, 2014 6:05 PM IST

queen
హిందీ సినిమాలను తెలుగులో తీయడం లేకపోతే మన సినిమాలను వాళ్ళు అరువు తీసుకెళ్లడం మనకు కామనే. ఇప్పుడు హిందీలో చాలామందితో ప్రశంసలు అందుకుంటున్న హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రం ‘క్వీన్’ని తెలుగులో తెరకెక్కించడానికి సిద్ధపడుతున్నారు

ఈ సినిమా హక్కులకోసం చిత్ర నిర్మాతలను టాలీవుడ్ కి సంబంధించిన కొందరు సంప్రదించినట్లు తెలిపారు. ఈ రిమేక్ కు సంబంధించి ఏ విషయం స్పష్టంకాకపోయినా కంగనా పాత్ర ఎవరు పోషిస్తారు అన్నాడు ఆసక్తికరంగా మారింది. మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం

తాజా వార్తలు