మరో సినిమాకు ఓకే చెప్పిన కళ్యాణ్ రామ్.. డైరెక్టర్ ఎవరంటే..?

నందమూరి కళ్యాణ్ రామ్ ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ మూవీ తర్వాత కాస్త బ్రేక్ తీసుకున్నాడు. ఆయన తన నెక్స్ట్ చిత్రాన్ని ఎప్పుడు
పట్టాలెక్కిస్తాడా అని నందమూరి ఫ్యాన్స్ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే, ఈసారి కళ్యాణ్ రామ్ వేరే ప్లాన్‌తో రాబోతున్నట్లు తెలుస్తోంది.

ఈసారి ఆయన రెండు వైవిధ్యమైన సినిమాలను చేసేందుకు సిద్ధమవుతున్నాడట. గతంలో వచ్చిన ‘బింబిసార’కు సీక్వెల్‌గా ‘బింబిసార 2’ను పట్టాలెక్కించేందుకు
కళ్యాణ్ రామ్ సిద్ధమవుతున్నాడు. అయితే, ఈ చిత్రాన్ని 2026 సెకండాఫ్‌లో మొదలయ్యే ఛాన్స్ ఉందని సమాచారం. కాగా, దీంతో పాటు రైటర్ శ్రీకాంత్ విస్సా
దర్శకుడిగా మారుతూ ఓ కథను కళ్యాణ్ రామ్‌కు వినిపించాడట. దీనికి కళ్యాణ్ రామ్ ఓకే చెప్పడంతో ఈ సినిమాను త్వరలోనే పట్టాలెక్కించనున్నారు.

మరి కళ్యాణ్ రామ్‌ను ఈ సినిమాలో శ్రీకాంత్ విస్సా ఎలా చూపెట్టబోతున్నాడనే విషయంపై ఇటీవల ఆయన జిమ్‌లో వర్కవుట్ చేస్తున్న ఫోటోలు వైరల్ అయిన విషయం తెలిసిందే.

Exit mobile version