గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ మూవీ ‘అఖండ 2’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తుండగా పూర్తి యాక్షన్ డ్రామాగా ఈ మూవీ ప్రేక్షకులను థ్రిల్ చేసేందుకు రెడీ అయింది.
ఇక ఈ సినిమా నుండి మేకర్స్ తాజాగా బ్లాస్టింగ్ రోర్ అంటూ ఓ సాలిడ్ అప్డేట్‌ను వదిలారు. ఈ బ్లాస్టింగ్ రోర్ వీడియో గ్లింప్స్‌తో బాలయ్య మరోసారి పూనకాలు తెప్పించాడు. బాలయ్య తనదైన మార్క్ పవర్‌ఫుల్ డైలాగ్ డెలివరీతో అదిరిపోయే ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. దానికి తోడు థమన్ థండరింగ్ బీజీఎం ఈ గ్లింప్స్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లింది.
బాలయ్య-థమన్ కాంబినేషన్ ఎందుకు అంత స్పెషల్ అనేది మరోసారి ఈ బ్లాస్టింగ్ రోర్‌తో నిరూపించారు. ఇక ఈ సినిమాలో ఆది పినిశెట్టి విలన్ పాత్రలో నటిస్తుండగా 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై గోపీ ఆచంట, రామ్ ఆచంట ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 5న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
