నేషనల్ క్రష్ రష్మిక మందన్న హిందీ హారర్ కామెడీ “థామా” బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తోంది. ఇక ఆమె నటించిన తెలుగు రొమాంటిక్ డ్రామా “ది గర్ల్‌ఫ్రెండ్” నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. నేషనల్ అవార్డు దర్శకుడు రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయింది.
కాగా, ఈ సినిమా ట్రైలర్‌ను అక్టోబర్ 25న రిలీజ్ చేస్తున్నారు. అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను దిగ్గజ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ రూ.14 కోట్లకు సొంతం చేసుకుందట. దీక్షిత్ శెట్టి హీరోగా నటించిన ఈ సినిమాలో రావు రమేష్, రోహిణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అందాల భామ అనూ ఇమ్మాన్యుయేల్ ప్రత్యేక పాత్రలో కనిపించనుంది.
ఈ చిత్రాన్ని విద్యా కొప్పినీడి, ధీరజ్ మొగిలినేని నిర్మించగా అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. హేషామ్ అబ్దుల్ వహాబ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.
