కన్నడ నటుడు కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి రూపొందించిన ది మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘కాంతార చాప్టర్ 1’ దసరా కానుకగా అక్టోబర్ 2న గ్రాండ్ రిలీజ్ అయింది. ఈ సినిమా పాన్ ఇండియా చిత్రంగా ప్రేక్షకులను మెప్పిస్తూ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
ఇక ఈ సినిమాకు వస్తున్న ట్రెమండస్ రెస్పాన్స్‌తో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది. తాజాగా ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌గా ఏకంగా రూ.818 కోట్ల మేర గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో ఈ సినిమా 2025లో హయ్యెస్ట్ వసూళ్లు రాబట్టిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది.
ఇప్పటివరకు ఈ రికార్డు బాలీవుడ్ చిత్రం ‘ఛావా’ పేరుపై ఉండగా.. ఇప్పుడు కాంతార చాప్టర్ 1 ఆ రికార్డును బద్ధలు కొట్టింది. ఇక ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించగా హొంబలే ఫిల్మ్స్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశారు.
