ఎట్టకేలకు ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న ‘కొత్త లోక చాప్టర్ 1’

మలయాళంలో తెరకెక్కిన లేడీ సూపర్ హీరో చిత్రం ‘లోక చాప్టర్ 1’ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను డొమినిక్ అరుణ్ తెరకెక్కించగా కళ్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్‌లో నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.300 కోట్ల వసూళ్లతో దుమ్ము లేపింది.

అయితే, ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ఓటీటీ రైట్స్ దక్కించుకున్న జియో హాట్‌స్టార్ ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌ను అనౌన్స్ చేసింది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 31 నుండి ఓటీటీలో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.

దీంతో ఈ సినిమాను ఓటీటీలో చూసేందుకు ప్రేక్షకులు రెడీ అవుతున్నారు. ఇక ఈ సినిమాను నటుడు దుల్కర్ సల్మాన్ ప్రొడ్యూస్ చేయగా ఇందులో టోవినో థామస్ కీలక పాత్రలో నటించాడు. ఈ చిత్రాన్ని జియో హాట్‌స్టార్ మలయాళ, తమిళ్, తెలుగు, కన్నడ, హిందీ, బెంగాలీ, మరాఠి భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించింది.

Exit mobile version