కాజల్ గతం బాధాకరం.. ఆ జబ్బుతో చాలా ఇబ్బందిపడిందట

పైకి కనిపించినట్టు ఉండదు మనిషి జీవితం అనే మాట అక్షరసత్యం. ప్రతి వ్యక్తి జీవితానికి ఇది సరిపోతుంది. ప్రతి మనిషికీ కనిపించని కష్టాలు చాలానే ఉంటాయి. వాటిని ఎదుర్కోవడంలోనే సాహసం ఉంటుంది. స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ జీవితంలో కూడ ఇలాంటి కష్టమే ఒకటి ఉందట. అదే బ్రాంకియాల్ ఆస్తమా. ఈ సమస్య ఉన్నవారికి శ్వాస సంబంధిత ఇబ్బందులు తీవ్రంగానే ఉంటాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. పొగ, దుమ్ము, చలి వాతావరణం లాంటివి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తాయి వీరిని. కాజల్ ఐదేళ్ల వయసులోనే ఈ జబ్బుకు ఎఫెక్ట్ అయిందట.

అప్పటి నుండి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఆ సమస్యను ఎదుర్కొంటూ వస్తున్నానని, ఇన్ హేలర్ తప్పక వాడాల్సిందేనని, అది వాడితేనే ఉపశమనం ఉంటుందని, ఎక్కడికి వెళ్లినా ఇన్ హేలర్ తీసుకువెళతానని చెప్పుకొచ్చారు ఈమె. ఇన్ హేలర్ వాడకం మీద అవగాహన కలిగించే సే ఎస్ టూ ఇన్ హేలర్ అనే క్యాంపెనింగ్లో భాగంగా కాజల్ ఈ సంగతులు చెప్పుకొచ్చారు. అందరి ముందు ఇన్ హేలర్ వాడటానికి సిగ్గుపడకండి. మీ సమస్యను బయటకి చెప్పుకోవడానికి సంకోచించకండి. సే ఎస్ టూ ఇన్ హేలర్ అంటూ ఇన్స్టాలో రాసుకొచ్చారు. ప్రస్తుతం కాజల్ మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ చిత్రంలో, కమల్ హాసన్ ‘ఇండియన్ 2’తో పాటు ‘హై సినామిక, మోసగాళ్లు, పారిస్ పారిస్, ముంబై సాగ’ లాంటి సినిమాల్లో నటిస్తున్నారు.

Exit mobile version