జీవా సరసన కాజల్ నటించనుందా?


ప్రస్తుతం సౌత్ ఇండియాలో ఫుల్ క్రేజ్ ఉన్న హీరోయిన్ కాజల్ అగర్వాల్. తెలుగు మరియు తమల భాషల్లో కాజల్ అగర్వాల్ కి ఫుల్ డిమాండ్ ఉంది. జీవా హీరోగా తెరకెక్కనున్న ‘యాన్’ చిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటించనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రవి కె. చంద్రన్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా మారనున్నారు. ప్రస్తుతం రవి కె చంద్రన్ మరియు కాజల్ మధ్య చర్చలు నడుస్తున్నాయి, ఈ విషయాన్ని త్వరలోనే అధికారికంగా తెలియజేస్తారు. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ తమిళంలో సూర్య సరసన ‘మాట్రాన్’ మరియు విజయ్ సరసన ‘తుపాకి’ సినిమాల్లో నటిస్తోంది. ఈ రెండు చిత్రాలపై తమిళంలో భారీ అంచనాలున్నాయి.

ఈ రెండు చిత్రాల చిత్రీకరణ పూర్తయిన తర్వాత కార్తీ సరసన ‘ఆల్ ఇన్ అల్ అజగు రాజ’ చిత్రంలో కాజల్ నటించనున్నారు. జీవా చిత్రంలో నటించే అవకాశం వస్తే కాజల్ తమిళ్ టాప్ 5 హీరోయిన్ల జాబితాలో చేరిపోతుంది. ప్రస్తుతం కోలీవుడ్లో అనుష్క, నయనతార, హన్షిక టాప్ లో ఉన్నారు. కాజల్ తమిళ చిత్రాలు కాకుండా తెలుగులో క్రేజీ సినిమాలయిన ‘నాయక్’, ‘సార్ ఒస్తారు’ మరియు మహేష్ బాబు – సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రాల్లో నటిస్తున్నారు.

Exit mobile version