స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఈమధ్యనే వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత కూడ సినిమాల్లో కొనసాగుతానని కొత్త సినిమాలకు సైన్ చేస్తానని చెప్పారు కాజల్. పెళ్లి పనులతో పాటు లాక్ డౌన్ కూడ ముగియడంతో ఇదివరకు మొదలుపెట్టిన సినిమా షూటింగ్లలో పాల్గొనడం స్టార్ట్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’తోనే ఆమె తిరిగి కెమెరా ముందుకొచ్చారు. అయితే తాజాగా ఒక కొత్త సినిమాకు సైన్ చేశారు కాజల్.
‘గుళేబగావళి’ ఫేమ్ కళ్యాణ్ దర్శకత్వంలో ఈ సినిమా ఉండనుంది. కొన్నిరోజుల క్రితమే రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ప్యాషన్ స్టూడియోస్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇది కాకుండా కాజల్ చేతిలో ‘ఆచార్య’తో పాటు ‘ఇండియన్ 2, హై సినామిక, మోసగాళ్లు, పారిస్ పారిస్, ముంబై సాగ’ లాంటి సినిమాలున్నాయి. ఇవి కాకుండా ఇటీవలే వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఒక వెబ్ సిరీస్ కు సైన్ చేశారు. మొత్తానికి తెలియకుండానే కాజల్ చేతిలో అరడజనుకు పైగా సినిమాలున్నాయి.