అజిత్ కుమార్ తో దర్శకుడు కె ఎస్ రవికుమార్ మూవీ చేస్తున్నట్లు, దీనిని సన్ పిక్చర్స్ నిర్మిస్తున్నట్లుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన స్వయంగా స్పందించారు. ఈ వార్తలో ఎటువంటి నిజం లేదని ఆయన స్పష్టత ఇచ్చారు. అలాగే తనకు ఎటువంటి ట్విట్టర్ అకౌంట్ లేదని, నా పేరున ఉన్న ఆ అకౌంట్ ఫేక్ అని వివరణ ఇచ్చారు. దీనితో అజిత్ కుమార్ తో ఆయన మూవీ చేస్తున్నట్లు వస్తున్న పుకార్లకు చెక్ పెట్టినట్లైంది.
సీనియర్ దర్శకుడు కే ఎస్ రవికుమార్ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్స్ హిట్స్ ఇచ్చారు. ఆయన గత రెండు చిత్రాలు నందమూరి నటసింహం బాలయ్యతో చేశారు. 2018లో సంక్రాంతి కానుకగా వచ్చిన జై సింహ ఓ మోస్తరు విజయాన్ని నమోదు చేయగా, గత ఏడాది డిసెంబర్ లో విడుదలైన రూలర్ మాత్రం డిజాస్టర్ గా మిగిలింది.