కె.ఎస్ రవికుమార్ దర్శకత్వంలో రజిని ఒక ప్రాజెక్ట్ చేయనున్నాడు అన్న వార్త రాగానే ఎవరికీ నచ్చిన కధనాలను వారు రాసేసుకుంటున్నారు. ఈ సినిమాలో అనుష్క నాయిక అని కొంతమంది అంటే కాదు కాదు ఆ స్థానం ఒక బాలీవుడ్ హీరోయిన్ ది అని మరికొందరి వాదన
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్ గా సోనాక్షి సిన్హాను ఎంపిక చేసుకున్నారట. కాకపోతే మాకందిన అధికారిక సమాచారం ప్రకారం ఇంకా హీరోయిన్ ఎవరు అనేది ఖరారు కాలేదట. అనుష్కా, సొనాక్షినా అని బుర్రలు బాదేస్కోకండి వారితో పాటూ మరికొంతమంది పేర్లను పరిశీలిస్తున్నాం అని ప్రొడక్షన్ టీమ్ తెలిపింది
ఈ సినిమా వేసవిలో మొదలుకానుంది. రాక్ లైన్ వెంకటేష్ నిర్మాత. రజిని నటించిన కొచ్చాడయాన్ విడుదలకు సిద్ధంగా వుంది