స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, గోవా బ్యూటీ ఇలియానా కథానాయికగా నటించిన ‘జులాయి’ చిత్రం ఆగష్టు 9న భారీగా విడుదలకు సిద్దమవుతోంది. కామెడీ కలగలిపిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. మాకు అందిన సమాచారం ప్రకారం యు.ఎస్ కు వెళ్ళవలసిన ‘జులాయి’ చిత్ర 52 ప్రింట్లు ఈ రాత్రికి బయలుదేరనున్నాయి. అందులో 13 ఫిజికల్ ప్రింట్లు మరియు 39 డిజిటల్ ప్రింట్లు ఉన్నాయి. ఈ రోజు రాత్రి మూడు గంటలకు హైదరాబాద్ నుండి బయల్దేరే ఎమిరేట్స్ ఫ్లైట్ లో ఈ చిత్ర ప్రింట్లు యు.ఎస్ కు వెళుతున్నాయి, ఇవి యు.ఎస్ లోని పలు ప్రాంతాలకు విడుదల రోజు ప్రీమియర్ షో టైం కి చేరిపోతాయి. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ చిత్రం అల్లు అర్జున్ కెరీర్లోనే అత్యంత భారీగా విడుదలవుతోంది. డి.వి.వి దానయ్య సమర్పణలో ఎం. రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.