హైదరాబాద్ వచ్చిన యంగ్ టైగర్ ఎన్.టి.అర్

హైదరాబాద్ వచ్చిన యంగ్ టైగర్ ఎన్.టి.అర్

Published on Feb 26, 2013 8:08 PM IST

NTR-look-for-Baadshah
యంగ్ టైగర్ ఎన్.టి.అర్ హైదరాబాద్ కు వచ్చాడు. యంగ్ హీరో ఎన్.టి.అర్.యూరోప్ లో ‘బాద్షా’ సినిమా షూటింగ్ ముగించుకొని ఈ రోజు ఉదయం హైదరాబాద్ కు వచ్చారు. ఈ సినిమా దాదాపుగా పూర్తయింది. ఈ సినిమాలోని కొన్ని పాటలను ఎన్.టి.అర్., కాజల్ పై యూరోప్ లో చిత్రీకరించారు. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఆడియో ని మార్చ్ 10న, సినిమాని ఏప్రిల్ 5న విడుదల చేయనున్నారు. బ్రహ్మానందం, ఎమ్.ఎస్.నారాయణ తో ఈ సినిమా అత్యంత కామెడీ తో తెరకెక్కిచారని సమాచారం. ఈ సినిమాకు థమన్ సంగీతాన్ని, కోన వెంకట్ – గోపి మోహన్ లు స్క్రిప్ట్ ను అందించారు.

తాజా వార్తలు