జాన్వీ కపూర్ బాలీవుడ్‌లో కెరీర్ ఆరంభించినా, ఆమెను సౌత్ ఆడియన్స్ తమ ఇంటి అమ్మాయిలాగానే భావిస్తారు. కారణం ఆమె తల్లి శ్రీదేవి పక్కా సౌత్ ఇండియన్ కావడమే. తన వ్యక్తిగత విషయాలు, పెళ్లి గురించి అడిగితే ఎప్పుడూ సౌత్ మూలాలు బయటకు వస్తాయని జాన్వి చెబుతుంది.
తాజాగా తన లేటెస్ట్ మూవీ ‘పరమ్ సుందరి’ ప్రమోషన్స్ కోసం కపిల్ శర్మ షోలో పాల్గొన్న జాన్వీ, పెళ్లి-పిల్లల గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా పిల్లల విషయమై ఆమె చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జాన్వీకి ముగ్గురు పిల్లలు కావాలని ఉందట. కారణం ఏమిటని అడిగితే మూడు తన లక్కీ నంబర్ అంటూ ఆమె సరదాగా జవాబిచ్చింది. అంతేగాక, ఇద్దరు పిల్లలు ఉంటే గొడవలు ఎక్కువవుతాయని.. ముగ్గురు ఉంటే ఇంట్లో ఎప్పుడూ సందడి ఉంటుందని ఆమె చెప్పుకొచ్చింది.
ఇక గతంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన తల్లి స్వస్థలమైన చెన్నైలోని పూర్వికుల ఇంట్లో పెళ్లి జరుపుకోవాలనే కోరిక వ్యక్తం చేసింది జాన్వీ. పెళ్లి తంతులు పూర్తయ్యాక తిరుమలలో వివాహం చేసుకుని, ఆ తర్వాత తిరుపతి లో సెటిల్ కావాలని అనుకుంటోందని చెప్పింది. ఇలా పెళ్లి, పిల్లలు అనే అంశాలపై జాన్వీ కోరికలు వింటూ అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారు.