‘పెద్ది’ ఫస్ట్ సింగిల్.. బుచ్చిబాబు హింట్ వైరల్!

‘పెద్ది’ ఫస్ట్ సింగిల్.. బుచ్చిబాబు హింట్ వైరల్!

Published on Oct 31, 2025 5:02 PM IST

Peddi Ram Charan

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రం పెద్ది కోసం అందరికీ తెలిసిందే. ప్రతీ చిన్న అంశాన్ని కేర్ తీసుకొని బుచ్చిబాబు ప్లాన్ చేస్తున్న ఈ సినిమాకి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

మంచి అంచనాలు ఈ ఆల్బమ్ పై ఉండగా ఈ మధ్య హైదరాబాద్ లో రెహమాన్ చేయనున్న కచేరి కార్యక్రమంలో పెద్ది సాంగ్ ప్రదర్శన ఉంటుంది అని టాక్ ఉంది. అయితే ఇప్పుడు ఇది దాదాపు ఖరారు అన్నట్టు దర్శకుడు బుచ్చిబాబు లేటెస్ట్ హింట్ తో కన్ఫర్మ్ అయ్యింది.

రెహమాన్ కచేరిపై వేసిన పోస్ట్ లో చివరి లైన్ గా సంథింగ్ స్పెషల్ రాబోతుంది అని చేసిన పోస్ట్ పెద్ది ఫస్ట్ సింగిల్ పై మరిన్ని ఆశలు రేకెత్తించింది. సో అది తెలియాలి అంటే ఈ నవంబర్ 8 వరకు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు