లేటెస్ట్ గా ఓటీటీ లో అలరించేందుకు వచ్చిన చిత్రాల్లో కన్నడ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం కాంతార చాప్టర్ 1 కూడా ఒకటి. దర్శకుడు నటుడు రిషబ్ శెట్టి తెరకెక్కించిన ఈ సినిమా సెన్సేషనల్ వసూళ్లు సాధించి నెల తిరక్కుండానే ఓటీటీ లోకి వచ్చేసింది. మరి ఈ సినిమా ఓటీటీ లోకి వచ్చినప్పటికీ ఇంకా థియేటర్స్ లో మంచి ఆదరణ కొనసాగిస్తుండడం విశేషం.
బుక్ మై షోలో ఇప్పటికీ ఈ సినిమా హావర్లీ ట్రెండింగ్ బుకింగ్స్ నమోదు చేస్తుంది. సో ఓటీటీ లోకి వచ్చినా కూడా ఈ సినిమాపై పెద్దగా ప్రభావం పడలేదు అనే అనుకోవాలి. ఇక ఈ సినిమాలో రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటిస్తే అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు అలాగే హోంబాలే ఫిలిమ్స్ వారు నిర్మాణం వహించారు.


