బాహుబలి ది ఎఫెక్ట్.. పుష్పరాజ్ పై మాటామంతీ..!

బాహుబలి ది ఎఫెక్ట్.. పుష్పరాజ్ పై మాటామంతీ..!

Published on Nov 1, 2025 12:28 AM IST

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ప్రెస్టీజియస్ చిత్రాలు ‘బాహుబలి’, ‘బాహుబలి 2’ ఇండియన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేశాయో అందరికీ తెలిసిందే. ఈ సినిమాల్లో ప్రభాస్ హీరోగా నటించగా, ఆయనకు ఎనలేని క్రేజ్ దక్కింది. ఇక ఈ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర కళ్లుచెదిరే కలెక్షన్స్ రాబట్టి తెలుగు సినిమా సత్తాను చాటాయి.

అయితే, తాజాగా ఈ రెండు సినిమాలను ఒకే సినిమాగా రీ-కట్ చేసి రీ-రిలీజ్ చేయడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇక ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ దక్కుతుండటంతో ఇప్పుడు సినీ సర్కిల్స్‌లో వేరొక సినిమా కూడా టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. బాహుబలి సినిమా రీ-రిలీజ్‌తో ప్రేక్షకుల్లో కొత్త ఉత్సాహం నెలకొందని.. ఇలాగే, అల్లు అర్జున్ నటించిన పుష్ప, పుష్ప-ది రూల్ చిత్రాలను కూడా ఒకే సినిమాగా రీ-రిలీజ్ చేస్తే బాగుంటుందని అభిమానులు కోరుతున్నారు.

దీంతో ఈ రెండు సినిమాలను కూడా ఒకే సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తే బాగుంటుందని ప్రేక్షకులు ఫీల్ అవుతున్నారు. మరి రాజమౌళి చేసిన ఫీట్‌ను దర్శకుడు సుకుమార్ చేయగలడా.. అనేది ఆసక్తికరంగా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు