ఇటీవల కాలంలో ఫిక్షన్ కంటెంట్‌లో తగ్గుదల ఎదుర్కొన్న ఆహా, ఇప్పుడు కొత్త ఉత్సాహంతో ముందుకు వస్తోంది. రాబోయే రోజుల్లో 3 రోజెస్ సీజన్ 2, నవంబర్ 7న విడుదల కానున్న రాజ్ తరుణ్ నటించిన చిరంజీవా, ధూల్‌పేట్ పోలీస్ స్టేషన్ క్రైమ్ థ్రిల్లర్, అలాగే కొత్త మిస్టికల్ థ్రిల్లర్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాయి.
వీటితో పాటు సర్కార్ సీజన్-6 (సుధీర్ హోస్ట్‌గా) మరియు చెఫ్ మంత్ర : ప్రాజెక్ట్ K వంటి హిట్ షోలు కూడా ప్రేక్షకులను అలరించేందుకు మళ్లీ వస్తున్నాయి. ఈ లైన్ అప్‌తో ఆహా “మేము మళ్లీ వచ్చాం” అని స్పష్టంగా చెబుతోంది. తెలుగు OTTలో మళ్లీ సత్తా చాటేందుకు ఆహా సిద్ధంగా ఉంది.


