ఆస్కార్ బరి నుండి ఎలిమినేట్ అయిన భారతీయ చిత్రం

ఆస్కార్ బరి నుండి ఎలిమినేట్ అయిన భారతీయ చిత్రం

Published on Feb 10, 2021 8:00 PM IST


2021 ఆస్కార్ బరిలోకి మలయాళ చిత్రం ‘జల్లికట్టు’ ఎంపికైన సంగతి తెలిసిందే. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో ఈ చిత్రం భారత్ తరపున ఎంట్రీ సాధించింది. ఫ్లిల్మ్ మేకర్ రాహుల్ రానైల్ నేతృత్వంలోని ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జ్యురీ ఈ చిత్రాన్ని ఎంపిక చేసింది. అన్ని భారతీయ భాషల్లో కలిపి మొత్తం 27 సినిమాలు పోటీపడగా ‘జల్లికట్టు’ ఎంపికైంది. ఈ చిత్రాన్ని లిజో జోస్ పెలిస్సెరి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. ఆంటోని వర్గీస్‌, చెంబన్‌ వినోద్‌ జోసే, సబుమోన్‌ అబ్దుసామద్‌ శాంతి బాల చంద్రన్ ఇందులో ప్రధాన పాత్రల్లో నటించారు.

అయితే తాజాగా ఆస్కార్ జ్యురీ షాట్ లిస్ట్ చేసిన 15 సినిమాల్లో ‘జల్లికట్టు’ స్థానం సంపాదించలేకపోయింది. దీంతో ఆస్కార్ బరి నుండి సినిమా ఎలిమినెట్ అయింది. గతంలో కూడ పలు భారతీయ సినిమాలు ఇలా ప్రిలిమినరీ స్టేజిలో ఎలిమినేట్ కాగా ఈసారి ‘జల్లికట్టు’ ముందుకు వెళ్తుందని భారతీయ సినీ ప్రేమికులు ఆశించారు. అయితే అందరినీ నిరాశకు గురిచేస్తూ ఈ చిత్రం ఎలిమినేట్ అయింది. ఏదిఏమైనా ‘జల్లికట్టు’ ఆస్కార్ స్థాయి అర్హతల పరిశీలన వరకు వెళ్లడం గర్వించదగిన విషయమే. ఇకపోతే ప్రిలిమినరీ స్థాయిని దాటిన 15 సినిమాల్లో 5 సినిమాలను షాట్ లిస్ట్ చేసి వాటి నుండి ఉత్తమ అంతర్జాతీయ చిత్రాన్ని ప్రకటిస్తారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు