జగపతి బాబుతో ‘ఆపరేషన్ దుర్యోధన 2’


గత కొంత కాలంగా డైరెక్షన్ కి దూరంగా ఉన్న పోసాని మళ్లీ మెగా ఫోన్ పట్టి ఆపరేషన్ దుర్యోధన 2 తీయబోతున్నాడు. శ్రీకాంత్ హీరోగా పోసాని కృష్ణ మురళి డైరెక్షన్లో వచ్చిన ‘ఆపరేషన్ దుర్యోధన’ సినిమాకి సీక్వెల్ తీయబోతున్నాడు. శ్రీకాంత్ హీరోగా నటించిన ఆపరేషన్ దుర్యోధన ఆయనకు మంచి పేరు తెచ్చి పెట్టడమే కాకుండా సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఈ ఆపరేషన్ దుర్యోధన 2 సినిమాలో జగపతి బాబు హీరోగా నటించనున్నట్లు సమాచారం. ఈ సినిమాని నట్టి కుమార్ నిర్మించనున్నారు. ఈ సినిమాకి సంభందించిన పూర్తి వివరాలు త్వరలో అధికారికంగా వెలువడనున్నాయి.

Exit mobile version