మరో ఘనత సాధించిన ఇష్క్


నితిన్ మరియు నిత్య మీనన్ జంటగా నటించిన ‘ఇష్క్’ చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై పెద్ద విజయాన్నే అందుకుంది. 7 సెంటర్లలో 100 రోజులు పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రం నితిన్ కెరీర్లోనే పెద్ద విజయంగా నమోదైంది. చాలా రోజులుగా హిట్ లేని నితిన్ కి ఈ సినిమా విజయం కొత్త ఊపిరి ఇచ్చినట్లు అయింది. నిర్మాతకు, డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు తెచ్చి పెట్టిన ఈ చిత్రం హిందీలో రీమేక్ చేసే ప్రయత్నాలు కూడా చేసారు. విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు. పిసి శ్రీరామ్ కెమెరా ఈ సినిమాకి బాగా ప్లస్ అయింది.

Exit mobile version