ఎస్‌టీఆర్ కోసం ఎన్‌టీఆర్.. కారణం అదేనా..?

NTR-STR

తమిళ దర్శకుడు వెట్రిమారన్ డైరెక్షన్‌లో స్టార్ హీరో శింబు నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘అరసన్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచాలు క్రియేట్ చేశాయి. అయితే, ఈ సినిమాను తెలుగులో ‘సామ్రాజ్యం’ అనే టైటిల్‌తో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఇక ఈ సినిమా కోసం మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తనవంతు సాయం అందించేందుకు ముందుకు వచ్చాడు.

ఈ సినిమా ప్రోమోలో ఎన్టీఆర్ వాయిస్‌ఓవర్ ఉంటుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో అసలు ఎన్టీఆర్ ఈ తమిళ సినిమా కోసం తన వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నాడా అనే సందేహం అభిమానుల్లో నెలకొంది. అయితే, శింబుతో ఎన్టీఆర్‌కు మంచి బాండింగ్ ఉంది. అటు దర్శకుడు వెట్రి మారన్‌తో ఎన్టీఆర్ ఓ సినిమా చేస్తాడనే టాక్ కొంతకాలంగా వినిపిస్తూ వస్తుంది.

ఈ రెండు కారణాల్లో ఏదో ఒకదాని కోసం ఎన్టీఆర్ ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాడని కోలీవుడ్ మీడియా చెబుతోంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. అక్టోబర్ 17న తెలుగు ప్రోమోను రిలీజ్ చేస్తున్నారు.

Exit mobile version