పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తన హిట్ దర్శకుడు హరీష్ శంకర్ తో ప్లాన్ చేసిన సినిమా “ఉస్తాద్ భగత్ సింగ్”. ఓజీ తర్వాత, పవన్ అభిమానుల ఆశలన్నీ ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ పై ఉన్నాయి, ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోందని ఫ్యాన్స్ విశ్వసిస్తున్నారు. త్వరలోనే ఉస్తాద్ భగత్ సింగ్ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ ఎట్రాక్షన్ గా విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు. అదే విషయాన్ని ఈ నెలలో ప్రకటించబోతున్నారు.
ఈ సినిమా షూటింగ్ ను తాజాగా పవన్ కల్యాణ్ పూర్తిచేసిన సంగతి తెలిసిందే. కాగా, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల మరియు రాశి ఖన్నా నటించారు. ఈ సాలిడ్ ప్రాజెక్ట్ కోసం పవన్ కళ్యాణ్ తన లుక్ ను కూడా మార్చారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే, ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.