ఇప్పుడు ఇండియన్ బాక్సాఫీస్ బాద్షా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరోసారి తన బాక్సాఫీస్ స్టామినా రుచి చూపించడానికి రెడీ చేస్తున్న బడా యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “సలార్”. లేటెస్ట్ గానే ఈ భారీ చిత్రానికి సంబంధించి ఫీమేల్ లీడ్ గా స్టార్ హీరోయిన్ శృతి హాసన్ ను లాక్ చేసేసినా సంగతి కూడా తెలిసిందే.
మరి ఇదిలా ఉండగా ఈరోజే ఈ భారీ చిత్రానికి సంబంధించి మేకర్స్ షూటింగ్ ను కూడా షురూ చేసేసారు. అయితే ఈ సినిమా మొదటగా యాక్షన్ సీక్వెన్స్ తోనే మొదలు అవుతుంది అని అనుకున్నా మరో సీన్స్ కూడా తెరకెక్కించనున్నట్టు అర్ధం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు కేవలం యాక్షన్ సీన్స్ మాత్రమే కాకుండా హీరో హీరోయిన్ మధ్య సీన్స్ కూడా ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది.
ముందు అయితే కేవలం యాక్షన్ సీన్స్ మాత్రమే అనుకున్నారు కానీ శృతి హాసన్ కూడా అప్పుడే షూట్ కు స్టార్ట్ అవ్వడంతో మెయిన్ లీడ్ మధ్య సీన్స్ కూడా ఇప్పుడు తీస్తున్నట్టు అర్ధం అవుతుంది. మరి ఇద్దరికీ కలిసి యాక్షన్ సీనా లేదా వేరే వేరేనా అన్నది తెలియాల్సి ఉంది.