ఈ కథకు కీర్తిని బ్లైండ్ గా ఫిక్స్ అయ్యిపోవచ్చా?

ఈ కథకు కీర్తిని బ్లైండ్ గా ఫిక్స్ అయ్యిపోవచ్చా?

Published on Aug 22, 2020 10:09 PM IST


ఒక పౌరాణిక సినిమా చేస్తున్నారు అంటే ఖచ్చితంగా అందులో క్యాస్టింగ్ చాలా ముఖ్యం. ఇతరత్రా అంశాలు పక్కన పెడితే సినిమా మొదలు నుంచి చివరి వరకు మనం క్యాస్టింగ్ నే చూస్తాం. మరి అలాంటప్పుడు నటీనటులు ఇచ్చే అవుట్ ఫుట్ మీదనే ఆడియెన్స్ రెస్పాన్స్ ఆధారపడి ఉంటుంది. అందుకే మేకర్స్ ఈ విషయంలో ది బెస్ట్ కోసమే చూస్తారు.

అలా ఇప్పుడు మన ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చాలా కాలం తర్వాత మళ్ళీ ఒక ఇతిహాస గాథను ప్రభాస్ మరియు ఓంరౌత్ లు తీసుకురాబోతున్నారు. వీరి కాంబోలో వస్తున్న “ఆదిపురుష్” రామాయణం పైనే వస్తుందని దాదాపు తెలిసిన అంశమే అలాగే ఈ చిత్రంలో రామునిగా ప్రభాస్ కనిపించడం కూడా ఖరారు అయ్యింది. అయితే ఇప్పుడు ప్రభాస్ సరసన సీతగా స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ నటించనుంది అని అనధికారిక ప్రచారం జరుగుతుంది.

అయితే ఈమె ఈ రోల్ లో సూటవుతుందా అంటే ప్రభాస్ అభిమానులు ఇమేజిన్ చేసుకొని ఖచ్చితంగా అవుతుందని అంటున్నారు. అవును ఈ పాతరకు కీర్తి ఖచ్చితంగా సరితూగుతుంది. సీతమ్మలో ఉండే అణకువత, అభినయం, ఆగ్రహం ఇలాంటి హావభావాలను కీర్తి చాలా బాగా పలికించగలదు. సో వీరు వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకోయ్ కీర్తి పేరును పరిశీలనలో ఉంచి ఉండొచ్చు. మరి ఏది ఏమైనప్పటికీ కీర్తి ఉందో లేదో అధికారిక ప్రకటన రావాల్సిందే.

తాజా వార్తలు