“సర్కారు వారి పాట”కు రిలీజ్ డేట్ లాక్ అయ్యిందా.?

“సర్కారు వారి పాట”కు రిలీజ్ డేట్ లాక్ అయ్యిందా.?

Published on Feb 10, 2021 2:00 PM IST

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ అండ్ బిగ్గెస్ట్ చిత్రం “సర్కారు వారి పాట”. దర్శకుడు పరశురామ్ మరియు కీర్తి సురేష్ తో మహేష్ మొట్ట మొదటిగా చేస్తున్న చిత్రం కావడం దీనికి ముందు మహేష్ హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకోవడంతో దీనిపై భారీ అంచనాలే నెలకొన్నాయి.

మరి ఇదిలా ఉండగా ఈ భారీ చిత్రానికి సంబంధించి మేకర్స్ కూడా ఆ మధ్యనే విడుదలపై క్లారిటీ ఇచ్చేసారు. ఈ మోస్ట్ అవైటెడ్ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నామని..అయితే అప్పుడు డేట్ ను మాత్రం రివీల్ చెయ్యలేదు. కానీ ఇప్పుడు ఈ చిత్రాన్ని ఏ డేట్ కు విడుదల చెయ్యబోతున్నారో అన్నది క్లారిటీ వస్తుంది.

ఈ చిత్రం విడుదల తేదిను 2022 జనవరి 14న లాక్ చేసినట్టుగా తెలుస్తుంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. మరి ఈ భారీ చిత్రానికి థమన్ అదిరిపోయే పాటలు మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు