“వకీల్ సాబ్” పై సంబంధం లేని గాసిప్స్.!?

“వకీల్ సాబ్” పై సంబంధం లేని గాసిప్స్.!?

Published on Feb 12, 2021 4:23 PM IST

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం “వకీల్ సాబ్” విధులకు రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ హిట్ చిత్రం పింక్ కు రీమేక్ గా దీనిని దర్శకుడు శ్రీరామ్ వేణు మన నేటివిటీకి తగ్గట్టుగా అనేక మార్పులు చేర్పులు చేసి తెరకెక్కించారు. అయితే ఈ మార్పులు చేర్పులులకు సంబంధించే మరిన్ని సంబంధం లేని గాసిప్పులు ఇప్పుడు వినిపిస్తున్నాయి.

వాటి ప్రకారమే ఇటీవలే ఓ గాసిప్ వినిపిస్తుంది. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ తమన్నా ఒక స్పెషల్ సాంగ్ చేస్తుంది అని. అయితే అసలు ఇది సినిమాకు ఏమాత్రం సంబంధం లేని టాక్. అలాగే స్పెషల్ సాంగ్ అంటే ఎంతసేపు ఐటెం సాంగ్ అనే ఆలోచనే ముందు వస్తుంది. కానీ వేరేలా పెట్టాలి అన్నా ఇందులో అందుకు స్కోప్ లేదు. ఒకవేళ పెట్టినా అది ఈ సినిమా ఇతివృత్తంనే దెబ్బ తీసేలా ఉంటుంది.

మరి ఇవన్నీ పక్కన పెడితే ఈ అనవసర గాసిప్స్ మాత్రం ఈ సినిమా విషయంలో కొన్ని రోజుల నుంచి వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే ఎలాంటి అప్డేట్స్ లేవని ఫ్యాన్స్ బాధ పడుతున్నారు. పైగా ఇలాంటివి మరింత చికాకు పుట్టించేలా ఉన్నాయి. మరి ఇక నుంచి అయినా మేకర్స్ ప్రమోషన్స్ పై దృష్టి పెడితే పవన్ కం బ్యాక్ సినిమాకు మంచి హైప్ వస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు