మహేష్ – రాజమౌళి ప్రాజెక్ట్ పై ఇంట్రెస్టింగ్ మ్యాటర్స్.!

మహేష్ – రాజమౌళి ప్రాజెక్ట్ పై ఇంట్రెస్టింగ్ మ్యాటర్స్.!

Published on Feb 11, 2021 1:00 PM IST

ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ ఎన్ని ప్రాజెక్ట్ కు చేస్తున్నా సరే తన అభిమానులకు మాత్రం ఎప్పటి నుంచో మోస్ట్ అవైటెడ్ గా ఉన్న భారీ ప్రాజెక్ట్ మాత్రం దర్శక ధీరుడు రాజమౌళితో ప్లాన్ చేస్తున్నదే అని చెప్పాలి. దాదాపు దశాబ్ద కాలమే అయ్యిపోయింది వీరి నుంచి ఒక సినిమా ఉంటుంది అని కానీ ఫైనల్ గా గత ఏడాది సినిమా చేయబోతున్నామని కన్ఫర్మేషన్ రావడంతో ఈ భారీ ప్రాజెక్ట్ ఎప్పుడు విడుదల అవుతుందా అని అంతా ఎదురు చూస్తున్నారు.

అయితే దీనికి సంబంధించి మరింత ఇంట్రెస్టింగ్ టాక్ శరవేగంగా స్ప్రెడ్ అవుతుంది. ఈ చిత్రానికి కథ అందిస్తున్న విజయేంద్ర ప్రసాద్ గారు దీనికి కూడా ఒక ఇంట్రెస్టింగ్ బ్యాక్ డ్రాప్ ఎంచుకున్నారని అలాగే దీనికి గాను ఒక పెద్ద రైటింగ్ టీమ్ నే పెట్టబోతున్నారని కూడా తెలుస్తుంది కనై ఫైనల్ గా మాత్రం స్టోరీని రాజమౌళినే ఫైనల్ చేసి పట్టాలెక్కించనున్నారట. మరి ఈ కాంబో నుంచి ఎలాంటి సినిమా రాబితుందో తెలియాలి అంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు