నాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ చిత్రాల్లో “టక్ జగదీష్” కూడా ఒకటి. తన హిట్ దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో ప్లాన్ చేసిన ఈ చిత్రంపై అన్ని వర్గాల ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. అలాగే ఈ చిత్రానికి సంబంధించి కూడా కొన్నాళ్ల నుంచి మంచి అప్డేట్స్ ను కూడా ఇస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు విడుదలకు రెడీ కాబోతున్న ఈ సినిమా నుంచి వరుస అప్డేట్స్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు.
అయితే ఈ సమయంలోనే ఈ చిత్రంపై మంచి ఇంట్రెస్టింగ్ సమాచారం కూడా బయటకు వచ్చింది. ఈ సినిమాలో ఓ హీరోయిన్ గా టాలెంటెడ్ హీరోయిన్ రీతూ వర్మ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈమెకు దర్శకుడు ఒక సాలిడ్ రోల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అంతే కాకుండా నానితో కలిపి ఉండే రొమాంటిక్ సీన్స్ ఒకెత్తు అయితే కామెడీ సీన్స్ మరో ఎత్తు లా ఉంటాయట. అయితే రీతూ నుంచి ఇప్పటి వరకు మంచి కామికల్ రోల్ చూసింది లేదు మరి ఈ చిత్రంలో ఎలా ఉంటుందో చూడాలి.