‘ఎన్టీఆర్ – హృతిక్ రోషన్’ కలయికలో రాబోతున్న మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా మల్టీస్టారర్ ‘వార్ 2’. ఈ సినిమాలో సెకండ్ హాఫ్ లో ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ ల పై వచ్చే మాస్ సాంగ్ ను షూట్ చేయడానికి ప్రస్తుతం సెట్ వేస్తున్నారు. ఈ సాంగ్ లో ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ ఇద్దరూ పోటీ పడేవిధంగా స్టెప్స్ ఉంటాయని.. పైగా ఈ సాంగ్ లో హృతిక్ రోషన్ ను మించేలా ఎన్టీఆర్ స్టెప్స్ ఉండబోతున్నాయని తెలుస్తోంది. విజువల్ గా కూడా భారీ స్థాయిలో సాంగ్ ఉండబోతుందట. ఈ సినిమా ఆగస్టు 14, 2025న థియేటర్స్ లోకి రాబోతుంది. ఇప్పటికే, ఈ చిత్రం భారీ బజ్‌ను సృష్టించింది.
కాగా, మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా మల్టీస్టారర్స్ లో ‘వార్ 2’ ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. పైగా ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ కలయిక అనగానే ఆడియన్స్ లో కూడా భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర పై ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. నిర్మాత ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కియారా అద్వానీ ఈ సినిమాలో కథానాయికగా నటిస్తోంది. 90% చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.