ఇలియానా బాలీవుడ్లో మరో సినిమాలో నటించనుందా?


తాజా సమాచారం ప్రకారం అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. గోవా బ్యూటీ ఇలియానా తన నాజూకైన ఒంపు సొంపులతో టాలీవుడ్ ని ఒక ఊపు ఊపిన ఈ భామ, రన్బీర్ కపూర్ హీరోగా నటిస్తున్న ‘బర్ఫీ’ చిత్రం ద్వారా బాలీవుడ్ కి పరిచయమవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. కునాల్ కొహ్లి దర్శకత్వంలో తెరకెక్కనున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ చిత్రంలో దాదాపు ఇలియానా హీరోయిన్ గా ఎంపికయ్యిందని సమాచారం. ఈ చిత్రంలో ‘విక్కీ డోనర్’ ఫేం ఆయుష్మాన్ ఖురాన్న హీరోగా నటిస్తున్నాడు. ఇదిలా ఉండగా అల్లు అర్జున్ మరియు ఇలియానా హీరోహీరోయిన్లుగా నటించిన ‘జులాయి’ చిత్రం ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే ఆగష్టు 15న రవితేజ – ఇలియానా జంటగా నటించిన ‘దేవుడు చేసిన మనుషులు’ సినిమా విడుదల కానుంది. ఇలా వరుసగా ఒక వారం గ్యాప్ లో వస్తున్న ఈ రెండు చిత్రాలు విజయం సాదించి ఇలియానాకి మరిన్ని అవకాశాలు తెచ్చిపెట్టాలని కోరుకుందాం.

Exit mobile version