లైఫ్ లాంగ్ ఆయనకే అంకితం అవుతానంటున్న డైరెక్టర్.!

లైఫ్ లాంగ్ ఆయనకే అంకితం అవుతానంటున్న డైరెక్టర్.!

Published on Feb 27, 2013 12:50 PM IST

Dasharath

‘కింగ్’ అక్కినేని నాగార్జున ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆయనతో ‘సంతోషం’ లాంటి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీసి హిట్ అందుకున్న డైరెక్టర్ దశరథ్. ఆ తర్వాత కూడా కుటుంబ కథా చిత్రాలు తీసి ఫ్యామిలీ డైరెక్టర్ గా పేరుతెచ్చుకున్న దశరథ్ దాదాపు 10 సంవత్సరాల గ్యాప్ తర్వాత మళ్ళీ అక్కినేని నాగార్జునతో కలిసి చేస్తున్న సినిమా ‘గ్రీకు వీరుడు’. నాగార్జునతో మీకున్న అనుబంధం ఏమిటని ఈయనని అడిగితే ‘ నేను ఈ రోజు ఈ స్థానంలో ఉన్నాను అంటే దానికి నాగార్జున గారే కారణం. ఆయనతో పని చేయడం చాలా సౌకర్యంగా ఉంటుంది. అలాగే నన్ను ఇంకెవరితో సినిమాలు చేయకుండా లైఫ్ లాంగ్ నాగార్జునతో మాత్రమే సినిమాలు చెయ్యమంటే సంతోషంగా చేస్తానని’ అన్నాడు.

నయనతార హీరోగా నటించిన ఈ సినిమాకి ఎస్.ఎస్ థమన్ సంగీతం అందించాడు. డి. శివప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 19న రిలీజ్ కానుంది.

తాజా వార్తలు