ప్రస్తుతం బాగా డిమాండ్ ఉన్న హీరోయిన్లలో సమంతా ఒకరు. ఒకవైపు విమర్శకులను మరో వైపు సిని అభిమానులను మెప్పించే నటిగా గుర్తింపు తెచ్చుకున్న సమంతా డబ్బు ఖర్చు పెట్టె విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటానంటుంది. సినిమా రంగంలో డబ్బు సంపాదించడం పెద్ద విషయం కాదు ఆ సంపాదించినా డబ్బుని పొదుపుగా ఖర్చు పెట్టడం చాలా కష్టం. ఆ విషయంలో నేను మా అమ్మ సలహాలు పాటిస్తాను. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ నాని సరసన ‘ఈగ’ మరియు ‘ఎటో వెళ్ళిపోయింది మనసు’ సినిమాల్లో నటిస్తుంది. ఇవే కాకుండా మహేష్ బాబు సరసన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో రామ్ చరణ్ సరసన ‘ఎవడు’ సినిమాలో, సిద్ధార్థ్ సరసన నందిని డైరెక్షన్లో నటిస్తుంది.