గతంలో ఇలాంటి పాత్ర చెయ్యలేదు అంటున్న తారకరత్న

గతంలో ఇలాంటి పాత్ర చెయ్యలేదు అంటున్న తారకరత్న

Published on Oct 21, 2012 7:00 PM IST


నందమూరి తారకరత్న తన రాబోతున్న రొమాంటిక్ చిత్రం “చూడాలని చెప్పాలని” గురించి చాలా ధీమాగా కనిపిస్తున్నారు.ఈ చిత్రం గురించి మాట్లాడుతూ ” ఈ చిత్రం చాలా ఆసక్తికరమయిన అంశాలతో నిర్మితమవుతుంది నాకు ఈ చిత్రం విజయం సాదిస్తుంది అన్న నమ్మకం ఉంది గతంలో ఇటువంటి పాత్ర చెయ్యలేదు ఈ చిత్రం నా కెరీర్లో నిలిచిపోయే చిత్రం కానుంది” అని అన్నారు. తారకరత్న సరసన ఈ చిత్రంలో మాధవీలత నటిస్తున్నారు. ఈ చిత్రంలో తారకరత్న అందుడిగా కనిపిస్తుండగా మాధవీలత మూగ యువతిగా నటిస్తున్నారు ఈ చిత్రానికి పార్గవన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఒక్క పాత మినహా చిత్రీకరణ మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్ర నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతుంది.

తాజా వార్తలు