నేను గ్లామరస్ హీరోయిన్ కావాలనుకోవడం లేదు : ఇషా చావ్లా


అందాల భామ ఇషా చావ్లా ‘ప్రేమ కావాలి’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమై, మొదటి చిత్రంతోనే అందరినీ ఆకట్టుకొని రెండవ సినిమా ‘పూల రంగడు’ తో మరో హిట్ అందుకుంది. ఈ భామ మూడవ చిత్రంతోనే బాలకృష్ణ లాంటి పెద్ద హీరో సరసన కథానాయికగా నటించే అవకాశం దక్కించుకుంది. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం గురించి పత్రికా విలేఖరులతో మాట్లాడుతూ ‘ సినిమా హిట్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో బాలకృష్ణ టాప్ హీరో, ఆయన సరసన కథానాయికగా నటించే అవకాశం ఇంత తొందరగా వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఆయన అంత పెద్ద హీరో అయినా సరే సెట్లోఅందరితో కలిసిపోయి పని చేస్తారు మరియు ఈ చిత్ర చిత్రీకరణ టైంలో ఆయన దగ్గరనుంచి ఎన్నో విషయాలను నేర్చుకున్నాను. అలాగే నేను గ్లామరస్ హీరోయిన్ గా ఉండాలని నాయికని కాలేదు, నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేసి ప్రేక్షకుల మదిలో నిలిచిపోవాలనేదే నా లక్ష్యం. నేను చేసే సినిమాలు కుటుంబ సమేతంగా చూడదగినవిగా ఉండాలని’ ఆమె అన్నారు. ఇషా చావ్లా ప్రస్తుతం సునీల్ సరసన బాలీవుడ్ హిట్ మూవీ ‘తను వెడ్స్ మను’ రిమేక్ చిత్రంలో నటిస్తున్నారు.

Exit mobile version