అప్పటికి షూటింగ్ గురించి ఏమీ తెలియదంటున్న డైరెక్టర్

అప్పటికి షూటింగ్ గురించి ఏమీ తెలియదంటున్న డైరెక్టర్

Published on Feb 24, 2013 11:48 AM IST

madhurasreedhar

13 సంవత్సరాలు ఐటి ఇండస్ట్రీలో పనిచేసి ఆ తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మధుర శ్రీధర్ మధుర ఆడియో కంపెనీని ప్రారంభించాడు. ఆ తర్వాత 2010లో ‘స్నేహగీతం’ సినిమా ద్వారా దర్శకుడిగా మారి హిట్ అందుకోవడమే కాక పలువురి ప్రశంశలు అందుకున్నాడు. ఆ తర్వాత రెండవ ప్రయత్నంగా చేసిన ‘ఇట్స్ మై లవ్ స్టొరీ’ సినిమాతో పరాజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం మధుర శ్రీధర్ తమిళ నటుడు మహాత్ రాఘవేంద్ర ని హీరోగా పరిచయం చేస్తూ చేసిన ‘బ్యాక్ బెంచ్ స్టూడెంట్’ సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

ఓ ప్రముఖ పత్రిక మొదటి చిత్రానికి ముందు డైరెక్టర్ గా పనిచేసిన అనుభవం లేదా షూటింగ్ చేసిన అనుభవం ఉందా అని అడిగితే ‘ నా మొదటి సినిమాకి ముందు నేను ఎప్పుడూ షూటింగ్ చెయ్యలేదు, నా మొదటి సినిమా కోసమే మొదటి సారి సినిమా సెట్లో అడుగుపెట్టాను. అప్పటికి నాకు షూటింగ్ కి సంబందించిన చాలా కీలకమైన విషయాలు తెలియవని’ మధుర శ్రీధర్ అన్నాడు.

తాజా వార్తలు