పొగరు అనుకుంటే అనుకోండి అంటున్న సమంత

పొగరు అనుకుంటే అనుకోండి అంటున్న సమంత

Published on Oct 18, 2012 8:50 AM IST


సమంత ఆరోగ్యం కుదుటపడ్డాక తిరిగి అభిమానులతో కలవడం మొదలు పెట్టింది సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో అభిమానుల ప్రశ్నలకు మరియు చాలా పరిస్థితులకు సమాధానం ఇస్తూ వచ్చింది తను ఎందుకు అవార్డు ఫంక్షన్స్ కి ఎందుకు హాజరు కారు అన్న ప్రశ్నను తను ఎదుర్కుంది ఆమె అవార్డు గెలుచుకున్న చాలా వేడుకలకు కూడా సమంత రాకపోవడం ఈ ప్రశ్నకు దారి తీసింది ఈ ప్రశ్నకు సమంత సమాధానం ఇస్తూ “అవార్డ్ వేడుకకు హాజరు కాకపోవడం నా పొగరు అని చెప్పిన ఒక వెబ్సైటు కి చెప్తున్నా అది పొగరు అనే మీరు అనుకోండి కాని నాకు తెలుసు అవార్డు ఎక్కడ నుండి వస్తుంది అనేది” అని చెప్పారు. ప్రస్తుతం ఈ నటి నందిని రెడ్డి చిత్రంతో బిజీగా ఉంది ఈ చిత్ర చిత్రీకరణ చివరి దశలో ఉంది. త్వరలో ఈ నటి “ఎవడు” చిత్ర బృందంతో కలవనుంది.

తాజా వార్తలు