అలాంటి ప్రేమలని నమ్మను అంటున్న తమన్నా

అలాంటి ప్రేమలని నమ్మను అంటున్న తమన్నా

Published on Oct 16, 2012 9:24 PM IST


మిల్కీ బ్యూటీ తమన్నా దక్షిణ భారతదేశంలో మంచి పేరున్న నటి మాత్రమే కాకుండా చాలా మంది అభిమానులను కూడా ఇక్కడ సంపాదించుకుంది. ఏబిఎన్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తమన్నా ప్రేమ గురించి చెబుతూ “నాకు మొదటి చూపులో ప్రేమ కలుగుతుంది అనడంలో నమ్మకం లేదు ప్రేమ అనేది నెమ్మదిగా కలిగే ఒక ప్రక్రియ లాంటింది నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. ఆ విషయంలో నాకు కొన్ని నమ్మకాలున్నాయి. మొదటి చూపులో కలిగే ప్రేమలను నేను ప్రోత్సాహించను” అని అన్నారు. పార్టీల గురించి అడిగిన ప్రశ్నకు “నేను చాలా దగ్గర స్నేహితులతోనే పార్టీలలో పాల్గొంటాను, ఎక్కువగా పార్టీలలో కనిపించే అలవాటు నాకు లేదు” అని అన్నారు. తమన్నకి పరిశ్రమలో మంచి పద్దతయిన కథానాయికగా పేరు ఉంది అదే విషయం ఈ సమాధానాలు చూస్తే అర్ధం అవుతుంది. తమన్నా గురువారం విడుదల కాబోతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం “కెమెరామెన్ గంగతో రాంబాబు”లో కనిపించనుంది.

తాజా వార్తలు