అగ్రతారలతో నేను చిత్రాలు చెయ్యలేను : తేజ


తన మనసులో ఏముందో నిర్భయంగా చెప్పే దర్శకుల్లో తేజ ఒకరు. ఈ దర్శకుడు కోపిష్టిగా పేరొందారు. ఈ మధ్యనే ఒకానొక ప్రముఖ పత్రిక కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో తేజ మాట్లాడుతూ ” నాకు టాలీవుడ్ లో తారలతో ఎలాంటి చిత్రాలు తీయాలో ఎలా చిత్రాలు తీయాలో తెలియదు వారికి నేను సరిపోను. ఫిలిం నగర్ లో కొంతమంది సినిమా పెద్దలు ఎలా చిత్రం ఉండాలి అది ఎలా సాగాలి అనేదానిని నిర్ణయించారు” అని చెప్పారు. ఆయన తాజా చిత్రం “నీకు నాకు డాష్ డాష్” ఈ శుక్రవారం విడుదలకు సిద్దమయ్యింది. తేజ ఈ చిత్ర విజయం కోసం ఎంతో ఉత్కంఠతో వేచి చూస్తున్నారు. ” ఈ చిత్రం కోసం నేను రెడ్ ఎపిక్ కెమెరా వాడాను ఇందులో 5K రేజల్యుషన్ఉన్న కెమరా ఇది ఆసియాలో మొట్టమొదటగా మేమే ఉపయోగించాము ఫలితం కూడా చాలా బాగా వచ్చింది. ఈ చిత్రంలో నూత నటీ నటులతో కొత్త రకమయిన కథను ప్రయత్నించాను” అని అన్నారు. ఈ చిత్రం భవ్య క్రియేషన్స్ బ్యానర్ మీద నిర్మించారు.

Exit mobile version