ఎప్పటికీ జెస్సి లానే ఉండిపోలేను కదా? – త్రిష


“దమ్ము” చిత్రం అద్బుతమయిన ఓపెనింగ్స్ సాదించడంతో త్రిష మేఘాల్లో తేలిపోతుంది జూనియర్ ఎన్టీయార్ తో మొదటి సారి కలిసి నటించిన ఈ చిత్రం ఈ ఏడాది అత్యంత వేచి చూసిన చిత్రాలలో ఒకటి. ఇంత చిన్న, తక్కువ ప్రాధాన్యత ఉన్న పాత్రను ఎందుకు ఒప్పుకున్నారని చాలా మంది అడిగిన ప్రశ్నకు త్రిష ఇలా సమాధానం ఇచ్చింది ” నేను ఎంత ఇష్టపడినా ఎప్పుడు జెస్సీ,సిరి,కీర్తి లానే చెయ్యలేను కదా అన్ని రకాల పాత్రలు చెయ్యాలి కదా చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ అయ్యిందా లేదా అనేది విషయం” అని అన్నారు. ఆ పాత్రలు వరుసగా “వినైతాండి వరువాయా” , “నువ్వొస్తానంటే నేనోద్దంటానా” మరియు ” ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే” చిత్రాలలో పాత్రలు. దమ్ము చిత్రం తరువాత ఈ భామ తమిళంలో విశాల్ సరసన “సమరన్” అనే చిత్రంలో కనిపించబోతున్నారు పరశురాం దర్శకత్వంలో రవి తేజ హీరోగా రాబోతున్న చిత్రం “సార్ వస్తారు” చిత్రంలో పాత్ర కోసం త్రిషను సంప్రదించారు. ఈ రెండు చిత్రాలు కాకుండా జీవా సరసన రొమాంటిక్ చిత్రంలో కనిపించబోతున్నారు.

Exit mobile version