ప్రస్తుతం సినీ ప్రేమికుల దృష్టి మొత్తం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మీదే ఉంది మరియు అతను తీసిన ‘కెమెరామెన్ గంగతో’ రాంబాబు’ సినిమా మీద ఉంది. మరి కొన్ని గంటల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇండస్ట్రీలో తన డైరెక్షన్ కి ఒక ప్రత్యేకతను ఏర్పరుచుకున్నారు. పూరి తను ఎప్పుడూ ప్రత్యేకంగా ఉండాలనుకుంటాను అని అంటున్నారు, బహుశా పూరి జాకీ చాన్ ని స్ఫూర్తి గా తీసుకున్నట్టు ఉన్నారు. చాలా కాలం క్రితం కొంత మంది జాకీ చాన్ ని ‘మీరు సెకండ్ బ్రూస్ లీ అవ్వాలనుకుంటున్నారా?’ అని అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ ‘ నేను మొదటి జాకీ చాన్ గా ఉండాలనుకుంటున్నాను’ అని అన్నారు. పూరి కూడా ఇదే ప్రశ్నకు కొంచెం అలాంటి సమాధానాన్నే ఇచ్చారు ‘ నేనెందుకు వేరొకరిలా ఉండాలి? నేను చేసే పనిలో వేరే వారి పోలిక ఎందుకు ఉండాలి? వేరే వారు చూపిన దారిలో నేనెందుకు నడవాలి? అని పూరి అన్నారు. ఆయన అన్నట్లుగానే పూరి జగన్నాథ్ తనకంటూ ఓ స్పెషాలిటీ ని ఏర్పరుచుకున్నారు. ‘బద్రి’ సినిమాతో డైరెక్టర్ గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన పూరి 25 సినిమాల మైలురాయిని తక్కువ టైంలోనే చేరుకున్నారు. అతని సినిమాల్లో హీరోయిజం, చాలా ఫాస్ట్ గా సినిమా ముందు కెళ్ళడం మరియు చాలా ఎంటర్టైనింగ్ గా ఉండటం చాలా బాగుంటాయి. అలాంటి పూరి తను తీసిన ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమాతో ఇండస్ట్రీ బాక్స్ ఆఫీస్ రికార్డులు తిరగ రాస్తాడా? లేదా? అనే దానికోసం మరికొన్ని గంటలు వేచి చూడాలి?
నేను ఎప్పుడూ ప్రత్యేకంగా ఉండాలనుకుంటాను : పూరి
నేను ఎప్పుడూ ప్రత్యేకంగా ఉండాలనుకుంటాను : పూరి
Published on Oct 18, 2012 3:26 AM IST
సంబంధిత సమాచారం
- SSMB29 ఎపిక్ అనౌన్స్మెంట్ ఆ రోజేనా..?
- ‘వరప్రసాద్ గారు’ కూడా దెబ్బతిన్నారు..!
- ప్రభాస్‌ను చూసి భయపడ్డానంటున్న సందీప్ రెడ్డి వంగా..!
- రీల్ కాదు.. రియల్ హీరో అనిపించుకున్న బెల్లంకొండ శ్రీనివాస్
- ఇంటర్వ్యూ : నిర్మాత సాహు గారపాటి – ‘కిష్కింధపురి’ ఆడియన్స్‌ను ఎంగేజ్ చేస్తుంది..!
- ‘మిరాయ్’లో ఆ సీక్వెన్స్ నెక్స్ట్ లెవెల్ అంటున్న మంచు మనోజ్
- సుకుమార్ నోట ‘పుష్ప 3’ మాట.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్!
- ఆ హీరోతో లోకేశ్ కనగరాజ్ సినిమా లేనట్టేనా..?
- బుక్ మై షోలో ‘మిరాయ్’ దూకుడు.. అప్పుడే ఆ మార్క్..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘లిటిల్ హార్ట్స్’ – యువతని ఎంటర్టైన్ చేస్తుంది
- సమీక్ష: ‘ఘాటి’ – కొంతవరకే మెప్పించే రివెంజ్ డ్రామా
- సమీక్ష: ‘మదరాసి’ – అక్కడక్కడా ఓకే అనిపించే యాక్షన్ డ్రామా
- సమీక్ష: బాఘి 4 – బోరింగ్ యాక్షన్ డ్రామా
- ఉస్తాద్ భగత్ సింగ్ సాలిడ్ అప్డేట్.. ఇది మామూలుగా ఉండదట..!
- ఎన్టీఆర్ హీరోయిన్‌కు అగ్నిపరీక్ష
- ఓటిటి సమీక్ష: ‘ఇన్స్పెక్టర్ ఝండే’ – తెలుగు డబ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో
- అక్కడ 35 వేల టికెట్స్ తో ‘ఓజి’ హవా!