ఇప్పుడు ప్రభాస్ చేస్తున్న బై లాంగువల్ భారీ ప్రాజెక్ట్ “ఆదిపురుష్” కోసం నిరంతరం ఏదొక బజ్ వినిపిస్తూనే ఉంది. మొత్తం ఐదు భాషల్లో విడుదల కానున్న ఏ ప్రాజెక్ట్ ను బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ ప్రభాస్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్నారు. మన ఇతిహాస గాథ రామాయణంలోని రామునిపై కొన్ని కీలక ఘట్టాలను చూపించనున్న దర్శకుడు ఈ చిత్రాన్ని 500 కోట్లు దాటే ప్లాన్ చేస్తున్నారు.
అయితే ఇలాంటి పురాణ గాథలు అంటేనే భారీ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ తో పని ఉంటుంది. అందుకే కేవలం ఏఈ విజువల్ ఎఫెక్ట్స్ కోసమే బడ్జెట్ లో సగం ఖర్చు చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది. ఈ చిత్రంలోని విజువల్ ఎఫెక్ట్స్ కోసం 250 కోట్లు వెచ్చించనున్నట్టు సమాచారం. అలాగే ఈ ఎఫెక్ట్స్ ఇండియన్ స్క్రీన్ పై ఎన్నడూ చూడని విధంగా కనీ వినీ ఎరుగని రీతిలో ఉంటాయట. మరి ఈ భారీ ఎపిక్ వండర్ లో ఎలాంటి సన్నివేశాలు చూపించనున్నారో చూడాలి.