“పుష్ప”లో ఒక్క సీక్వెన్స్ కు అంతా?

“పుష్ప”లో ఒక్క సీక్వెన్స్ కు అంతా?

Published on Aug 23, 2020 9:03 PM IST

ప్రస్తుతం టాలీవుడ్ దాదాపు అన్ని పెద్ద ప్రాజెక్ట్ లు కూడా మళ్ళీ తిరిగి షూటింగ్స్ ప్రారంభించనున్నాయి. అలా వాటిలో ప్రారంభం కానున్న మరో భారీ పాన్ ఇండియన్ చిత్రం “పుష్ప” కూడా ఒకటి. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందులోను అల్లు అర్జున్ పాన్ ఇండియన్ ఎంట్రీ మూవీ కావడంతో నార్త్ ఆడియెన్స్ కూడా బాగానే ఎదురు చూస్తున్నారు.

అయితే సుకుమార్ ఈ చిత్రాన్ని ఎర్ర చంద్రనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో తీస్తున్న సంగతి కూడా తెలిసిందే. అంటే పక్కా మాస్ మసాలా ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఇప్పుడు ఒక యాక్షన్ సీక్వెన్స్ కోసం మాత్రమే 6 కోట్లు ఖర్చు పెట్టనున్నారట. ఇది హీరో మరియు విలన్ ల మధ్యలో సాగేది అన్నట్టు బజ్ వినిపిస్తుంది. అయితే ఈ చిత్రంలో మొదట తమిళ్ స్టార్ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతిని అనుకోగా తాను తర్వాత తప్పుకున్నాడు. దీనితో ఎవరు మరి ఈ భారీ యాక్షన్ సీక్వెన్స్ లో నటించనున్నారు అన్నది హాట్ టాపిక్ గా మారింది.

తాజా వార్తలు